అగ్నిప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధం

అగ్నిప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధం

కోనసీమ: అయినవిల్లి మండలం చింతనలంకలోని అగ్నికుల క్షత్రియ వీధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. దీంతో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. విషయం తెలుసుకున్న బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, రాష్ట్ర నాయకులు శ్రీరామ చంద్రమూర్తి బాధితులను పరామర్శించారు.