'యువత దేశ అభివృద్ధికి శక్తిగా నిలవాలి'

'యువత దేశ అభివృద్ధికి శక్తిగా నిలవాలి'

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజినీరింగ్ కాలేజ్‌లో గురువారం పట్టభద్రుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. "యువత ఆత్మనిర్భర్ భారత్‌కు రాయబారులుగా, అమృత కాలంలో దేశాభివృద్ధికి శక్తులుగా నిలవాలి" అన్నారు. AI, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో యువత ఆవిష్కరణలు చేయాలన్నారు.