జిల్లాలో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్
RR: వేసవి ప్రభావంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. క్వింటాల్ ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. గత నెలలో ఇది రూ.4 వేలే ఉంది. దిగుబడులు తగ్గడం, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని పలు మార్కెట్ల నుంచి బయటకు సరుకు తగ్గింది. ప్రస్తుతం రోజుకు ఒక లారీ మాత్రమే వెళ్లుతోంది.