ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ఇవ్వాళ భారత మాజీ ఉపప్రధాని, 'బాబుజీ' జగజీవన్ రామ్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, సామాజిక సమానత్వం కోసం బాబుజీ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.