వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీత ప్రచారానికి బ్రేక్

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీత ప్రచారానికి బ్రేక్

తూ.గో: పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. శనివారం ఎటువంటి అనుమతులు లేకుండా పిఠాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అనుమతులు లేకుండా ఎటువంటి ప్రచారాలు చేయడానికి అనుమతులు లేదని హెచ్చరించారు.