సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఛైర్మన్

మెదక్: నర్సాపూర్ పరిధిలోని 11వ వార్డులో మంగళవారం సీసీ రోడ్డు పనులను పుర ఛైర్మన్ అశోక్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గోడ రాజేందర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ చల్ల మురళి, వర్క్ ఇన్‌స్పెక్టర్ భూపాల్, వార్డు అధికారులు రాములు, దుర్గయ్య, పాల్గొన్నారు.