రంగనాథస్వామికి విశేష అలంకరణ

రంగనాథస్వామికి విశేష అలంకరణ

ATP: తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఆలూరు కోన రంగనాథస్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.