'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి'

KMM: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా దిగిరావాలన్నారు.