పడమటి ఆంజనేయ స్వామికి మంత్రి పూజలు
NRPT: మక్తల్ పట్టణంలోని పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామికి శనివారం రోజు రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించగా మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. తెలుగు కొత్త సంవత్సరం మొదటి శనివారాన్ని పురస్కరించుకొని నిర్వహించే పల్లకి సేవ మహ మంగళారతి కార్యక్రమాలలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల పురస్కరించుకొని ఏర్పాట్లపై ధర్మకర్తతో చర్చించారు.