సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే పోలీస్ వారిని సంప్రదించండి
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో సెల్‌ఫోన్‌ల అపహరణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సుస్మితా రామనాథన్ సూచించారు. ఆదివారం పట్టణ ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. సెల్‌ఫోన్ ఎవరైనా పోగొట్టుకున్న, లేదా అపహరణకు గురైన స్థానిక పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశారు.