జూదం స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.. 12 మంది పట్టివేత
HNK: కాజీపేట మండలం ప్రశాంత్‌నగర్‌లోని సింగిరెడ్డి శివారెడ్డి ఇంట్లో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 2,06,860 నగదు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.