గోదావరి వరదల్లో లంక గ్రామాలు

కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టుంది. పి. గన్నవరం, అయినవిల్లి, ఆలమూరు మండలాల్లోని లంకల్లో పంట పొలాలు, కూరగాయల తోటలు, పాదులు ముంపునకు గురయ్యాయి. ఆలమూరు మండలం మూలస్థానం నుంచి రావులపాలెం మండలం తోకలంక మధ్య రెండు వారాల క్రితం తూరలతో నిర్మించిన కాజ్ వే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.