VIDEO: అన్నంలో విషం కలిపి భర్తను హత్య యత్నం

VIDEO: అన్నంలో విషం కలిపి భర్తను హత్య యత్నం

HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో భర్తను హత్య చేయాలన్న యత్నం విఫలమైంది. మాధవి కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త రమేశ్‌ను చంపేందుకు అన్నంలో పురుగుల మందు కలిపింది. అయితే ముందుగా మామ జెన్నయ్య భోజనం చేయబోతుండగా వాసన గుర్తించి ఉమ్మేయడంతో ప్రమాదం తప్పింది. కుటుంబ సభ్యుల ప్రశ్నలతో మాధవి తప్పు ఒప్పుకుంది. రమేశ్ ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.