ఎస్పీ హెచ్చరిక: కోడ్ పాటించాల్సిందే!

ఎస్పీ హెచ్చరిక: కోడ్ పాటించాల్సిందే!

SRPT: జిల్లాలో ఎన్నికల కోడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పండుగలా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 486 గ్రామాలకు గాను, 170 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ ఈరోజు సూచించారు.