VIDEO: ఘనంగా వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవం
TPT: సూళ్లూరుపేట మండలం కోళ్లమిట్టలోని భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్య స్వామి ధ్యాన మందిరంలో ఆరాధన మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రెసిడెంట్ ఆంబాకం మునికృష్ణా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.