సీఐడీ విచారణకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరు

సీఐడీ విచారణకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరు

TG: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సతీమణితో కలిసి హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. జనవరి 29న జరిగిన ఘటనపై కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధుల్లో అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.