సీఎం ఆస్తుల చిట్టా.. రూ.27.99 కోట్ల సంపద
పుదుచ్చేరి సీఎం రంగసామి తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.27.99 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఇందులో రూ.8 కోట్ల విలువైన పూర్వీకుల స్థలం, రెండు ఇళ్లు, 12 గ్రాముల బంగారం, రెండు కార్లు ఉన్నాయి. తట్టంచావడి, మంగళం నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు రూ.35 లక్షల అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కాగా, ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.