ఆదర్శనీయంగా ఆర్టీసీ సిబ్బంది..

ఆదర్శనీయంగా ఆర్టీసీ సిబ్బంది..

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన హైదరాబాద్ - దేవరకొండ రూట్‌లో నడుస్తున్న బస్సులో పీఏపల్లి మండలం కోదండపురంకు చెందిన అనిల్, రూ.50 వేల విలువైన ల్యాప్‌ట్యాప్ పోగొట్టుకున్నాడు. డ్రైవర్ ఫయాజుద్దీన్, కండక్టర్ అలివేలుమంగ గమనించి డిపో అధికారులకు అందజేశారు. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విచారణ చేసి బాధితునికి ల్యాప్‌ట్యాప్ అందజేసినట్లు సోమవారం తెలిపారు.