జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా విద్యార్థులు

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా విద్యార్థులు

VZM: జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21నుంచి 23 వరకు ఉత్తరప్రదేశ్ బరేలీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ ప్రతినిధి అయ్యలు ఇవాళ తెలిపారు.