పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మతులు
AKP: రావికమతం నుంచి గొంప వెళ్లే రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను కప్పే కార్యక్రమాన్ని శనివారం రావికమతం పోలీసులు చేపట్టారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో గ్రావెల్తో ఈ రోడ్డు మార్గంలో ఏర్పడ్డ గోతులను కప్పించారు. ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్సై రఘువర్మ తెలిపారు.