ఈ నెల 23న వారాంతపు సంత ప్రారంభం

ADB: కుంటాల మండలం కల్లూరు గ్రామంలో ఈనెల 23న కూరగాయల సంత ప్రారంభిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం వారాంతపు సంతను గ్రామంలో నిర్వహిస్తున్నామని చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి గురువారం నిర్వహించే ఈ సంస్థను రైతులు వ్యాపారులు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.