రూపాయి లేని ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు?
తమిళనాడు తిరునెల్వేలి జిల్లా ఓల్డ్ పెట్టె ప్రాంతంలోని ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇళ్లు మొత్తం వెతికితే రూ.10 కూడా దొరకలే. దీంతో ఆ దొంగ ఇంటి యజమానికి లేఖ రాశాడు. 'నమస్తే సార్.. నేను ఒక దొంగను.. మీరు ఇంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు.. ఒక్క రూపాయి కూడా లేని ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు.. సారీ సర్.. నన్ను క్షమించండి' అని రాసుకొచ్చాడు. అది చూసిన ఇంటి యజమాని షాక్ అయ్యాడు.