VIDEO: 2½ లీటర్ల గుడుంబా స్వాధీనం.. వ్యక్తిపై కేసు
HNK: ఐనవోలు మండలంలోని పంతిని గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి శుక్రవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కల రవి అనే వ్యక్తి ఇంటి వద్ద గుడుంబా అమ్ముతుండగా పట్టుకుని, అతని వద్ద నుంచి 2½ లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.