ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

BHPL: రేగొండ మండల శివారులో గంగరావు చెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బైకుల మీద ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన వాహనదారులు గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.