ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
NTR: నందిగామలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్లాత్ మర్చంట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలను అభినందించిన ఆమె, ప్రజల ఆరోగ్య రక్షణకు ఇలాంటి శిబిరాలు అవసరమన్నారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.