'యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'
మహబూబాబాద్: జిల్లా రైతులకు అవసరమైన యూరియాను అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. రైతులు ఇక యూరియా దొరకదనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.