నిత్య అన్నదాన పథకానికి భారీ విరాళం..!

నిత్య అన్నదాన పథకానికి భారీ విరాళం..!

కృష్ణా: మోపిదేవిలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భారీ విరాళం అందింది. ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామానికి చెందిన సుసర్ల వెంకట శశికృష్ణ రాఘవ, జయనందిని దంపతులు రూ.1,00,111 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అభినందించి, స్వామివారి ప్రసాదం అందజేశారు.