జనహిత పాదయాత్ర విజయవంతం చేయాలి: మంత్రి

HNK: పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం MLA నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, ఈ నెల 25న వర్ధన్నపేటలో జరిగే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు బలరాం నాయక్, కావ్య, ఎమ్మెల్యేలు నాగరాజు, మక్కన్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.