నీటి భద్రతపై రైతులకు అవగాహన కార్యక్రమం

నీటి భద్రతపై రైతులకు అవగాహన కార్యక్రమం

KRNL: ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంపై పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యన్న గౌడ్, టీడీపీ నాయకులు ముక్కన్న, మునెప్ప, గ్రామ అధ్యక్షుడు బోయ యంకన్న తదితరులు పాల్గొన్నారు.