VIDEO: తెలుగుగంగ పథకానికి నీరు విడుదల
NDL: పాములపాడులోని బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ పథకంలో అంతర్భాగమైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఇవాళ 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలు బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నాయన్నారు. అక్కడి నుంచి VBRకు నీటి విడుదలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.