వీధిలైట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

NLR: నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన నూతన వీధిలైట్లను మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ బుధవారం రాత్రి పరిశీలించారు. నగరంలోని 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ, టిట్కోపరిసర ప్రాంతాలు, గాంధీ గిరిజన సంఘం ప్రాంతాలలో ఆయన పర్యటించి వీధిలైట్లు పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది, స్థానిక నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.