'షీ టీమ్స్'పై అవగాహన కల్పించిన ఎస్సై

'షీ టీమ్స్'పై అవగాహన కల్పించిన ఎస్సై

VKB: బాలికల భద్రతే లక్ష్యంగా శనివారం దోమ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు 'షీ టీమ్స్'పై అవగాహన కల్పించారు. దోమ ఎస్సై వసంత్ జాదవ్, పరిగి సబ్ డివిజన్ షీ టీం ఇంఛార్జ్ నర్సింలు పాల్గొని ప్రసంగించారు. పాఠశాలలో లేదా బయట ఎక్కడైనా ఆకతాయిలు భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడినా వెంటనే 100 లేదా 181కి సమాచారం ఇవ్వాలని సూచించారు.