VIDEO: గతంలో రూ.82 కోట్ల అవినీతి జరిగింది: మంత్రి
NLR: ధాన్యం తరలింపుకు ట్రాన్స్ పోర్టు చేయడంలో ఇబ్బందికర పరిస్థితి ఉందని రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. కోవూరులో మాట్లాడుతూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతును అన్యాయంగా బలి చేసి రూ. 82 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. రైతులు నష్టపోతుంటే అవినీతిపరులు రోలెక్స్ వాచీలు కొనుక్కొని కార్లలో తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు.