పొలంలో వరి నాట్లు వేసిన విద్యార్థులు

VZM: నెల్లిమర్ల మండలంలోని కొత్తపేట గ్రామంలో పలువురు విద్యార్థులు శుక్రవారం పొలం బాట పట్టారు. నెల్లిమర్ల సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు క్షేత్రస్థాయిలో వరి పొలాలను పరిశీలించి వ్యవసాయం చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలం మడిలో దిగి నాట్లు వేశారు.