ముందు వెళ్తున్న బస్సును ఢీకొన్న లారీ
CTR: బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ముందు వెళ్తున్న ప్రైవేట్ బస్సుని వెనుక నుంచి అతివేగంగా వచ్చి లారీ ఢీ కొనడంతో వెనక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు.