పొగమంచుతో జాగ్రత్త: సీపీ

పొగమంచుతో జాగ్రత్త: సీపీ

NZB: చలికాలం దృష్ట్యా రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకుని ఉంటుందని.. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మారుమూల రహదారుల్లో ఉదయం 11 గంటల వరకు కూడా పొగమంచు ఉంటుందన్నారు.