'RRRలో భూమిని కోల్పోతున్న వారిని ఆదుకుంటాం'

'RRRలో భూమిని కోల్పోతున్న వారిని ఆదుకుంటాం'

SDPT: రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, భూ సేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ హైమావతి తెలిపారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న మర్కూక్, వర్గల్ మండలాల రైతులతో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.