T20 సిరీస్.. టీమిండియాకు శుభవార్త

T20 సిరీస్.. టీమిండియాకు శుభవార్త

దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు T20I సిరీస్‌కు టీమిండియా స్టార్  ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా సిద్దంగా ఉన్నారు. గిల్, హార్దిక్ గాయం నుంచి కోలుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ వెల్లడించాడు. ఈ కీలక ఆటగాళ్ల రీఎంట్రీ.. T20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు బలం చేకూర్చనుంది. కాగా, రేపు కటక్ వేదికగా తొలి టీ20 జరగనుంది.