సన్నబియ్యం సరఫరా సాఫిగా జరగాలి: కలెక్టర్

సన్నబియ్యం సరఫరా సాఫిగా జరగాలి: కలెక్టర్

JN: జిల్లా కేంద్రంలోని రేషన్ షాప్ నంబర్ 18 డీలర్ దాసి సరూప, షాప్ నంబర్ 7 డీలర్ ఆకుల బాలనీల రేషన్ షాప్‌లను మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా సందర్శించారు. బియ్యం సరఫరా విషయాలు, బియ్యం క్వాలిటీ గురించి తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులు సన్న బియ్యం పొందాలని తెలియజేసారు. అధికారులు ప్రభుత్వ నియమ నిబంధన పాటించాలని ఆదేశించారు.