రెండు బైకుల ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

రెండు బైకుల ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

TPT: చంద్రగిరి బైపాస్ రోడ్డులోని నూరు జంక్షన్ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంక్ వద్ద బుదవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హోండా యాక్టివా స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది. అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.