రామోజీరావు మృతి పట్ల టీడీపీ నాయకులు నివాళులు

కోనసీమ: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు మృతి పట్ల టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసం వద్ద రామోజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికా రంగంలోని దిగ్గజాన్ని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఆయన ఎందరికో దిక్సూచి అని అన్నారు.