రేపు చిన్నచింతకుంటలో 'హిందూ సమ్మేళనం'
MBNR: చిన్నచింతకుంట మండల కేంద్రంలోని సంత బజార్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వక్తగా ఏలె శ్యామ్ జీ, ముఖ్య అతిథిగా బ్రహ్మచారి చిత్స్వరూపానంద హాజరుకానున్నారు. మండలంలోని హిందూ బంధువులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.