రోడ్డుపై నిలిచిన నీరుతో.. ప్రయాణికులు ఇబ్బందులు

NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి ప్రాంతంలో వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా పెంచలకోన రోడ్డుమార్గంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు నీటమునిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మార్గంలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రయాణికులు వెళ్తుండటంతో సమస్య మరింత పెరిగిందన్నారు.