అయినవిల్లి విఘ్నేశ్వరునికి కళాన్యాస పూజలు

తూ.గో: అయినవిల్లిలో కొలువైన విఘ్నేశ్వర స్వామికి సోమవారం వేదపండితుల ఆధ్వర్యంలో కళాన్యాస పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో స్వామికి పంచామృతాభిషేకం, లక్ష దూర్వార్చన, కళాన్యాస పూజలు జరిపారు. కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.సత్యనారాయణ రాజు సమీక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.