బైక్‌ను ఢీ కొట్టిన లారీ యువకుడు మృతి

బైక్‌ను ఢీ కొట్టిన లారీ యువకుడు మృతి

WGL: బైక్‌పై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సంగెం మండలం గవిచర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గవిచర్ల గ్రామానికి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపెళ్లి వైపు వెళ్తున్న క్రమంలో వరంగల్ నుంచి వస్తున్న కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు.