డిగ్రీ కళాశాల భవన నిర్మాణంపై ఎమ్మెల్యేకు వినతి

డిగ్రీ కళాశాల భవన నిర్మాణంపై ఎమ్మెల్యేకు వినతి

MDK: కౌడిపల్లిలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే తహశీల్దార్‌తో మాట్లాడి అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కళాశాల ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.