డీకేతో నాది పాలు, తేనే బంధం: సిద్ధరామయ్య
Dy.CM డీకే శివ కుమార్‌తో తనది పాలు, తేనె సంబంధం అని తమనెవరూ విడదీయలేరని CM సిద్దరామయ్య అన్నారు. డీకేపై నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని వచ్చిన ఆరోపణలను CM ఖండించారు. 'నేనెందుకు DK ఫోన్ ట్యాప్ చేస్తాను. మేమిద్దరం బాగున్నాం. మా బంధం చెడపకండి. నేను దొంగనై ఇతరులను నమ్మడం లేదనే సామెతలా ఇవో అసంతృప్తి వ్యాఖ్యలు' అని మండిపడ్డారు.