మద్దికేరలో ఆగిపోయిన ఆధార్ సేవలు
KRNL: మద్దికేరలో గతంలో రెండు ఆధార్ సేవలు వివిధ సచివాలయాల్లో నిర్వహిస్తూ ఉండేవారు. మంగళవారం నాటికి దాదాపు 10 రోజులు అవుతున్నా ఆధార్ సేవలు పున:ప్రారంభించలేదని స్థానికులు వాపోయారు. ఈ విషయంపై ఎంపీడీవో కొండయ్యను వివరణ కోరగా.. గతంలో విధులు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు బదిలీ కావడం, ప్రమోషన్లపై వెళ్లడంతో ఆధార్ సేవలు నిలిచిపోయాయన్నారు.