గ్రేటర్ HYDలో ఆలస్యంగా రక్త నమూనా రిపోర్టులు..!
HYD: గ్రేటర్ పరిధి ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ డయాగ్నస్టిక్ సర్వీస్ రక్త నమూనాలు సేకరిస్తోంది. అయితే వారాల తరబడి పరీక్షా రిపోర్టులు అందకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స ఆలస్యం అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి రిపోర్టుల విడుదలను వేగవంతం చేయాలన్నారు.