VIDEO: శివాలయంలో భక్తుల పూజలు
SRPT: తుంగతుర్తిలోని తూర్పుబజారులో గల స్వయంభూ మహాదేవర లింగేశ్వర స్వామి శివాలయంలో సోమవారం కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో శివలింగానికి భక్తులు అభిషేకాలు, పూలతో అందంగా అలంకరించి పూజలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది.